Monday, April 18, 2011

ఏ పిల్లలకైతే శివబాబాపై పూర్తి నిశ్చయం ఉంటుందో వారి గుర్తులు ఏమిటి?

మధురమైన పిల్లలూ - పిల్లలైన మీ కొరకు కొత్త రాజ్యస్థపన చేసేందుకు బాబా దూరదేశం నుండి వచ్చారు. ఇప్పుడు మీరు స్వర్గానికి అర్హులుగా అవుతున్నారు.

ప్రశ్న: ఏ పిల్లలకైతే శివబాబాపై పూర్తి నిశ్చయం ఉంటుందో వారి గుర్తులు ఏమిటి?

జవాబు: వారు కళ్ళు మూసుకొని బాబా శ్రీమతముపై నడుస్తూ ఉంటారు. ఏ ఆఙ్ఞ లభిస్తే అది చేస్తారు. ఇందులో ఏదైనా నష్టం కలుగుతుందేమోనన్న ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే ఇటువంటి నిశ్చయబుద్ధి కల పిల్లల బాధ్యత బాబాది, వారికి నిశ్చయపు బలం లభిస్తుంది. వారి స్థితి అచలముగా స్థిరముగా అయిపోతుంది.

గీతము: నీవే తల్లివి, నీవే తండ్రివి.......

ధారణకొరకు ముఖ్యసారము:

1. సేవలో ఎముకలను సైతం ఇచ్చేయాలి. ఏ విషయంలోనూ సంశయించకూడదు. అందరికీ సేవ ద్వారా సుఖమును ఇవ్వాలి. దు:ఖమును ఇవ్వకూడదు.

2.నిశ్చయపు శక్తి ద్వారా మీ స్థితిని అచలముగా తయారుచేసుకోవాలి. ఏ శ్రీమతం లభించినా అందులో కళ్యాణం ఇమిడి ఉంటుంది. ఎందుకంటే దానికి బాబా బాధ్యులు. కావున మీరు చింతించకూడదు.

వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను మీ నిజసంస్కారముగా చేసుకొనే మహాన్ ఆత్మాభవ.

స్లోగన్: సంపూర్ణ పవిత్ర యోగులుగా అవ్వడమే స్నేహానికి బదులు ఇవ్వడము.

ఓంశాంతి.

No comments:

Post a Comment