Thursday, April 21, 2011

భయపడే నాట్యమును వదిలి సదా సంతోషపు నాట్యమును చేసే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ.

మధురమైన పిల్లలూ - పతిత జగత్తుతో మీ సంబంధాన్ని తెంచి ఒక్క బాబాతో బుద్ధియోగాన్ని జోడించినట్లైతే మాయతో ఓటమిని పొందరు.

ప్రశ్న: సమర్ధుడైన తండ్రి తోడుగా ఉంటూ కూడా యఙ్ఞములో అనేక విఘ్నాలు ఎందుకు వస్తాయి?

జవాబు: డ్రామానుసారంగా ఈ విఘ్నాలు రావలసిందే! ఎందుకంటే ఈ యఙ్ఞంలో అసురుల విఘ్నాలు వచ్చినప్పుడే పాపభాండము నిండుతుంది. ఇందులో బాబా ఏమీ చేయలేరు. ఇది డ్రామాలో రచింపబడినది. విఘ్నాలు రావలసిందే , కానీ మీరు విఘ్నాలనుచూసి కంగారుపడకండి.

ధారణకొరకు ముఖ్యసారము:

1.మాయా బాక్సింగ్‌లో ఎప్పుడూ ఓడిపోకూడదన్న ధ్యానమును ఉంచాలి. కల్పపూర్వపు స్మృతి ద్వారా మీ స్థితిని తయారుచేసుకోవాలి. సంతోషంగా మరియు శాంతిగా ఉండాలి.

2. మీకు మీరు ఉపకారము చేసుకునేందుకు శ్రీమతంపై నడవాలి. ఈ పాత ప్రపంచతో, సంబంధీకులతో సంబంధాన్ని తెంచివేసుకోవాలి. మాయా తుఫానుల నుండి రక్షించుకునేందుకు చిత్రాలను మీ ముందు ఉంచుకొని బాబాను మరియు వారసత్వాన్ని స్మృతిచేయాలి.

వరదానము: భయపడే నాట్యమును వదిలి సదా సంతోషపు నాట్యమును చేసే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ.

స్లోగన్: ఎవరి సంకల్పము మరియు కర్మలు ఉన్నతంగా ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు.

No comments:

Post a Comment