మధురమైన పిల్లలూ - ఇది మీ అద్భుతమైన యూనివర్సిటీ. ఇందులో పాడైన భాగ్యమును తీర్చిదిద్దే బోలానాధుడైన బాబా మీకు శిక్షకుడిగా అయి చదివిస్తారు.
ప్రశ్న: ఈ వినాశన సమయంలో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్ని ఇస్తారు?
జవాబు: హే ఆత్మలారా! ఇప్పుడు పావనంగా అవ్వండి. పావనంగా అవ్వకుండా ఎవరూ ఇంటికి తిరిగి వెళ్ళలేరు. అర్ధకల్పం రోగముల నుండి ముక్తులయ్యేందుకు మీరు అందరినీ ఏడురోజుల బట్టీలో కూర్చోబెడతారు. పతితుల సాంగత్యం నుండి దూరంగా ఉండండి. ఎవరూ గుర్తు రాకుండా ఉన్నట్లైతే ఙ్ఞానం కొంత బుద్ధిలో ధారణ అవుతుంది.
ధారణకొరకు ముఖ్యసారము:
1.ఏ విషయంలోనూ వాదనలోకి వచ్చి మీ సమయాన్ని వ్యర్ధం చేసుకోకూడదు. వ్యర్ధమైన విషయాలలోకి బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో వికర్మలను వినాశనం చేసుకోండి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి.
2.ఈ పురాతన ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పుకోవాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిచేయాలి. కొత్త ఇల్లు తయారవుతోంది కాబట్టి పాతదాని నుండి మనసును తొలగించుకోవాలి.
వరదానము: సాకార రూపంలో బాప్‌దాదాను సమ్ముఖంగా అనుభవం చేసుకునే కంబైండ్ రూపధారీ భవ.
స్లోగన్: మాయాజీతులుగా, ప్రకృతీజీతులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే సర్వుల కళ్యాణులు లేక విశ్వకల్యాణులు.
No comments:
Post a Comment