మధురమైన పిల్లలూ - మీరు పుష్పాలుగా అయి అందరికీ సుఖమును ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడాలి.
ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి ఏ శిక్షణను ఇస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు.
జవాబు: ఓ నా పుష్పాల వంటి పిల్లలూ, నాలో అసురీ అవగుణములనే ముళ్ళు ఏవీ లేవుకదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లోపల ఏవైనా ముళ్ళు ఉన్నట్లైతే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలాగే మీ అసురీ గుణాలను ద్వేషించండి. అప్పుడు ఆ ముల్లు వెళ్ళిపోతుంది. శిక్షలు అనుభవించవలసి వచ్చే వికర్మలు ఏవీ మనసా-వాచా-కర్మణలలో జరగడంలేదుకదా అని మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి.
ధారణకొరకు ముఖ్యసారము:
1.మాయా గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటినుండి ఎల్లప్పుడూ ఙ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్యదోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.
2. సుగంధమయమైన పుష్పంగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ ఉండాలి. శ్రీమతంపై చాలా చాలా వినమ్రులుగా అవ్వాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి.
వరదానము: "ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు" అన్న ఈ పాఠపు స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారుచేసుకొనే శ్రేష్ఠ ఆత్మా భవ.
స్లోగన్: ఙ్ఞానశక్తిని ధారణ చేసినట్లైతే విఘ్నాలు యుద్ధంచేసేందుకు బదులుగా ఓడిపోతాయి.
ఓంశాంతి.
No comments:
Post a Comment